ఆధ్యాత్మికం.. | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికం..

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

రేపటి నుంచి హరినామ సప్తాహం

బాన్సువాడ రూరల్‌: మండలంలోని తాడ్కోల్‌ గ్రామ విఠలేశ్వర మందిరంలో ఈనెల 11 నుంచి అఖండ హరినామ సప్తాహం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచ్‌ అందె రమేష్‌ తెలిపారు. ఈసందర్భంగా శనివారం గ్రామంలో ఆయన గ్రామస్తులు, వార్కారి భక్తులతో కలిసి కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వార్కారి మహారాజ్‌ గొల్ల గంగాధర్‌యాదవ్‌, సొసైటీ చైర్మన్‌ గంగుల గంగారాం, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, దర్జి హన్మాండ్లు, లక్ష్మణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నప్రసాదం వితరణ

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి కోడూరు హనుమాన్‌, పశుపతినాథ్‌ ఆలయ ప్రాణప్రతిష్ఠాపన ఉత్సవాలు శనివారం మూడోరోజు కొనసాగాయి. ఈసందర్భంగా జలావాసంలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను ధాన్యవాసంలోకి మర్చారు. సామూహిక హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు వేదపండితులు ఆంజనేయశర్మ అన్నప్రసాదం అందజేశారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు.

వైభవంగా పెద్దమ్మ కల్యాణోత్సవం

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలోగల పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

కొనసాగుతున్న ఆలయ వార్షికోత్సవాలు

మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్‌ గ్రామంలోగల లక్ష్మీనరసింహస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ శనిగరం కమలాకర్‌ రెడ్డి, ఈవో ప్రభు రాంచంద్రం, డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement