ఎల్లారెడ్డిరూరల్/ఎల్లారెడ్డి/నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరిందని ప్రజాప్రతినిధులు అన్నారు. ఎల్లారెడ్డిలోని 12వ వార్డులో నూతనంగా నిర్మించిన జూకంటి రుక్కవ్వ ఇందిరమ్మ ఇంటిని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. అలాగే మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో చాకలి సాయిలు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ గజ్జల జీవన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ అనసూయ శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


