గోమాతల అక్రమ రవాణా అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

గోమాతల అక్రమ రవాణా అరికట్టాలి

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

పిట్లం(జుక్కల్‌): గోమాతల అక్రమ రవాణాను అరికట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు శనివారం పిట్లం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై ఆంజనేయులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బక్రీద్‌ పండుగ సందర్భంగా గోమాతలను అక్రమంగా తరలించి హింసాత్మక చర్యలకు పాల్పడటం హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. గో సంరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గోమాతల అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొరారు. విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి: గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చే యాలని కోరుతూ వీహెచ్‌పీ నాయకులు శనివారం ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డికి వినతిపత్రం అందించారు. గోహత్య జరగకుండా తగిన చర్యలను తీసుకోవాలని వారు విన్నవించారు. వీహెచ్‌పీ, గోసంరక్షక్‌ నాయకులు వినోద్‌, తులసి, రాజు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement