పక్షుల దాహార్తి తీరుస్తూ..
బాన్సువాడ: మండే ఎండలో పక్షుల దాహా ర్తిని తీర్చేలానే సంకల్పంతో ఓ చిన్నారి తనకు తోచిన ఆలోచనకు పదును పెట్టింది. పట్టణానికి చెందిన తేలి శ్రియాదిత ఖాళీ వాటర్ బాటిళ్లను మధ్య వరకు కట్ చేసి బాటిళ్లలో నీటిని నింపి ఇంటి పైన స్లాబ్‌కు కట్టింది. మరికొన్ని బాటిళ్లలో ధాన్యం గింజలు వేసి ఉంచడంతో ప్రతిరోజు పదుల సంఖ్యలో పక్షులు వచ్చిన ధాన్యం గింజలు తిని నీటిని తాగి వెళ్తున్నట్లు చిన్నారి తెలిపింది.
విద్యార్థి పేరు:
తేలి శ్రియాదిత,
పదో తరగతి,
పాత బాన్సువాడ


