ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలి

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

నాగిరెడ్డిపేట: వర్షాలు కురిసినా కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని డీఎస్‌వో రామ్మోహన్‌ సూచించారు. శనివారం ఆయన నాగిరెడ్డిపేట, తాండూర్‌ గ్రామాల్లో ని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. సీ ఈవోలు సందీప్‌, చంద్రమురళిలతో మాట్లా డి కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. రైస్‌మిల్లులకు తరలించిన వడ్లకు సంబంధించి ట్యాబ్‌ ఎంట్రీ ప్రక్రియ వెంటవెంటనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 230 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా ఇప్పటివరకు 1.38 లక్షల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇప్పటికే 18వేల మంది రైతుల ఖాతాల్లో ధాన్యం డ బ్బులు రూ. 303 కోట్లు జమ చేశామని పే ర్కొన్నారు. ఆయన వెంట మానిటరింగ్‌ అధి కారి రాధిక తదితరులున్నారు.

పీహెచ్‌సీని సందర్శించిన

కేంద్ర బృందం

రామారెడ్డి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం నేషనల్‌ క్వాలి టీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్యూఏఎస్‌) బృందం సందర్శించింది. లేబర్‌ రూమ్‌, జ నరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఓపీ విభాగం, జాతీ య ఆరోగ్య కార్యక్రమాల విభాగాలను పరిశీలించారు. పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యాధికారి సురేశ్‌ మాట్లాడుతూ తనిఖీ బృందం సూచనలను పాటిస్తామన్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు జాశ్వ అభిషేక్‌ బండాలా, రాజేష్‌ మిశ్రా, డీఎంహెచ్‌వో రవీందర్‌ గౌడ్‌, జిల్లా ప్రోగ్రాం అధికారులు విద్య, రోహిత్‌, రాజు గౌడ్‌, వైద్యాధికారులు యెమీమా, విజయ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇతర ప్రాంతాల వారితో అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌అర్బన్‌: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే కార్మికులు, అద్దెదారులు, ఉద్యోగుల విషయంలో ఇంటి యజమానులు, వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య ఒక ప్రకటనలో సూచించారు. ఉపాధి కోసం వచ్చే వ్యక్తుల పేరు, శాశ్వత చిరునామా, ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్లు కుటుంబ వివరాలు, పనిచేసే స్థలం వచ్చిన తేదీ వంటి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అవసరం అయితే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కూడా వారి వివరాలు నమోదు చేయించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement