● రెండు వ్యాన్‌లు, కారు, ఓ బైక్ దగ్ధం
● కామారెడ్డి పట్టణంలోని
దేవునిపల్లిలో ఘటన
కామారెడ్డి క్రైం: గృహ వినియోగ సిలిండర్‌లో నుంచి కారులోకి గ్యాస్ నింపుతుండగా అగ్ని ప్రమాదం సంభవించి రెండు వ్యాన్‌లతోపాటు ఓ కారు, బైక్ దగ్ధమయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలి టీ పరిధిలోని దేవునిపల్లిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. సురేశ్, శ్రీశైలం అనే ఇద్దరు వ్యక్తు లు వారి ఇంటికి సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో వేసి ఉన్న రేకుల షెడ్డులో కొంత కాలంగా తమ కార్లను పార్కింగ్ చేసుకుంటున్నారు. నిబంధనలకు విరు ద్ధంగా గృహ వినియోగ సిలిండర్ నుంచి ఓ వ్యాన్‌లోకి గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తు మంట లు చెలరేగి షెడ్డులో ఉన్న అన్ని వాహనాలకు వ్యా పించాయి. స్ధానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే రెండు ఈకో వ్యాన్‌లు, ఓ బెలెనో కారు, ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యా యి. ప్రమాదానికి కారణమైన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్, రీఫిల్లింగ్ మిషన్‌లను దేవునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చేవరకు కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు.


