ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): పదో తరగతి తరువాత చాలా మంది బాలికలతోపాటు బాలురు ఇంటర్ విద్యకు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు బీడీలు చుట్టడం, టైలరింగ్ వంటి పనుల వైపు, వ్యవసాయ నేపథ్యం ఉన్న బాలురు అటువైపు వెళ్తుండగా.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారు ఇదో ఒక పనికి వెళ్తూ పైచదువులకు దూరవుతున్నారు. అలాగే ఇంటర్ కళాశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్య తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు పాఠశాల విద్య(8 నుంచి 10వ తరగతి), ఇంటర్మీడియెట్‌ను విలీనం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఉండవనే చర్చ విద్యాశాఖలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ రెండు ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) ప్రకారం 10+2 విద్యను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చేవి. ఇంటర్మీడియట్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల కోర్సులు ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలో ఉండేవి.
పరీక్షల విధానంలో మార్పులు
8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విలీనమైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు ఉండే అవకాశాలు లేవు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్కూల్ బోర్డు పరిధిలో విద్యార్థులు అభ్యసించనున్నారు. అలాగే 8 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు నూతన బోర్డు పరిధిలో వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.
జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు
పాఠశాల విద్యాశాఖలో ఇంటర్‌బోర్డు విలీనానికి రంగం సిద్ధం
రెండు శాఖల నుంచి ప్రతిపాదనలు
8 నుంచి 12వ తరగతి వరకు
ఒక బోర్డు..
ఒకటి నుంచి ఏడో తరగతి వరకు
మరొక బోర్డు
రానున్న విద్యా సంవత్సరం నుంచే అమలులోకి!


