మా దృష్టికి వచ్చింది..
● కొందరికి పనులు చేయకున్నా
హాజరు వేస్తున్నారన్న ఆరోపణలు
● చర్యలు తీసుకోవాలని కోరుతున్న కూలీలు
పెద్దకొడప్‌గల్: గ్రామాలనుంచి వలసలను తగ్గించి స్థానికంగానే పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపట్టిన ఉపాధి హామీ పథకం కొందరి వల్ల నీరుగారిపోతోంది. పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పనులు చేయకున్నా కొందరికి హాజరు వేస్తున్నారని పలువురు కూలీలు పేర్కొంటున్నారు. మండలంలోని పలు గ్రామాలలో కొందరు కూలీలు కేవలం హాజరు సమయానికి వచ్చి ఫొటోలు దిగి వెళ్తున్నారని తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు తమవారు పనులు చేయకున్నా పట్టించుకోవడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల ఇస్టారాజ్యం కొనసాగుతోందని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పనులు చేసేవారికే కూలి డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు.
కొంతమంది కూలీలు ఎలాంటి పనులు చేయకుండానే ఫొటోలు దిగి వెళ్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. పనులు చేయని వారికి హాజరు వేయవద్దని ఫీల్డ్ అసిస్టెంట్‌లకు చెప్పాం. పనిచేసేవారికే వేతనాలు అందేలా చూస్తాం.
– సుదర్శన్, ఏపీవో, పెద్దకొడప్‌గల్


