కామారెడ్డి క్రైం: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం లింగాపూర్‌లో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతుల ఆర్థికాభివృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దూడల సంరక్షణ, పశుగ్రాసాల సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కాఫ్ ర్యాలీ నిర్వహించి రైతులకు పశు సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి భరత్, మండల పశువైద్యాధికారి రవికిరణ్, కౌన్సిలర్ కాసర్ల రాణి, విజయ డెయిరీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.


