వారంనుంచి నీళ్లొస్తలేవు | - | Sakshi
Sakshi News home page

వారంనుంచి నీళ్లొస్తలేవు

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

వారంనుంచి నీళ్లొస్తలేవు నీటి ఎద్దడి లేకుండా చర్యలు

మా కాలనీకి వారం రోజులుగా నీళ్లు రావడం లేదు. మున్సిపల్‌ బోరు కూడా అరగంట కంటే ఎక్కువ రాదు. పైప్‌లైన్‌ సరిగ్గా లేకపోవడంతో కుళాయిల ద్వారా నీరు అందడం లేదు. ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టుకుని ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రతిరోజూ నీళ్ల కోసమే మా సమయమంతా సరిపోతోంది.

– సాయవ్వ, గోసంగి కాలనీ, కామారెడ్డి

పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే మున్సిపల్‌ బోర్ల మరమ్మతులకు నిధులు కేటాయించాం. నీటి సమస్య ఎక్కువగా ఉన్న కాలనీలకు మున్సిపల్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. అమృత్‌ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించాం.

– టి.పర్వతాలు, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement