మోపాల్(నిజామాబాద్‌రూరల్): చిన్నారులను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలనే ఉద్ధేశంతోపా టు వారు ఆయా అంశాల్లో నైపుణ్యం సాధించేలా మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల సొసైటీ వేసవిలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. సొసైటీ కార్యదర్శి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలు కలిగిన పాఠశాలల్లో వేసవి శిబిరాలు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో ని మోపాల్ మండలం కంజర శివారులో ఉన్న మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్‌లోని 11, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 13 పాఠశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులకు 15 రోజులపాటు వేసవికాల శిబిరాన్ని ఏర్పాటుచేసింది. శిక్షణా శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని పాఠశాలలో ని ర్వహించగా, నిజామాబాద్ ఆర్‌సీవో సత్యనాథ్‌రె డ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేసవి సెల వుల్లో గ్రామాల్లో, ఇళ్లల్లో విద్యార్థులు చేయాల్సిన, చేయకూడని పనులను క్షుణ్ణంగా వివరించడంతోపాటు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీ, వైస్ ప్రిన్సిపాల్ సుదం, సిబ్బంది కత్తుల శంకర్, రాజేందర్, పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శిక్షణనిచ్చిన అంశాలు
విద్యార్థులకు 15 రోజులపాటు వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, కంప్యూటర్, కరాటే, డ్యాన్స్, హ్యాండ్ రైటింగ్, పేపర్ కటింగ్స్‌తోపాటు టేబుల్ టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇచ్చారు. ఇందుకోసం సుమారు 25 మంది వరకు నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించారు. ముగింపు సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు.
వేదిక్ మ్యాథ్స్ ద్వారా చాలా విషయాలు తె లిశాయి. గణితమంటే భయపడకుండా సులభపద్ధతిలో వేదిక్ మ్యా థ్స్‌లో మెలకువలు నేర్చుకున్నాను. దీంతోపాటు డ్యాన్స్, సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాం. వివిధ జిల్లాల విద్యార్థులందరం ఒక దగ్గర శిక్షణ పొంది స్నేహితులుగా మా రడమే కాకుండా ఎన్నో అంశాలు నేర్చుకున్నాం. – సాయి భానుతేజ,
ఏడోతరగతి, తాండూరు, ఆదిలాబాద్
వేసవి శిక్షణాశిబిరంలో అనేక విషయాలు నేర్చుకున్నాను. స్పోకెన్ ఇంగ్లి
ష్, వేదిక్ మ్యాథ్స్, కంప్యూటర్ వంటి వాటిపై చాలా అవగాహన వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని అంశాలపై శిక్షణనిచ్చారు. క్రీడల్లోనూ పాల్గొనడంతో శారీరకంగా ఉల్లాసంగా అనిపించింది.
– దత్తాద్రి, ఏడోతరగతి, బీర్కూర్, కామారెడ్డి
విద్యార్థులకు చదువుతోపా టు క్రీడలు, ఇతర అన్నిరంగా ల్లో రాణించాలి. సెల్‌ఫోన్లు, టీవీలకు ఆకర్షితులై చదువు ను మర్చిపోతున్నారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో యేటా వేసవిలో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. శిబిరం విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పీఈటీలు, పీడీలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సత్యనాథ్‌రెడ్డి, ఆర్‌సీవో, ఉమ్మడి నిజామాబాద్
విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ
మోపాల్ బీసీ బాలుర గురుకులంలో ముగిసిన వేసవి శిబిరం
పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్,
ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు


