బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణలు అర్థరహితం | - | Sakshi
Sakshi News home page

బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణలు అర్థరహితం

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ కో–ఆప్షన్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికేనని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కాసర్ల గోదావరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి ఆమె మాట్లాడారు. స్థానిక పరిస్థితులను బట్టి, పట్టణ అభివృద్ధిని కాంక్షించి మున్సిపాలిటీల్లో పరస్పర సహకారం ఉంటుందని, అందుకనే చైర్‌పర్సన్‌, కో–ఆప్షన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. దీనిని రాజకీయ కోణంలో చూడటం తగదన్నారు. భైంసా, అమంగల్‌, ఖానాపూర్‌ వంటి మున్సిపాలిటీల్లో బీజేపీ స్వయంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను పొందిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. అక్కడ లేని అపవిత్ర పొత్తు కామారెడ్డిలో ఎలా కనిపిస్తుందని నిలదీశారు. కౌన్సిలర్లు హాఫీజ్‌బేగ్‌, ప్రభాకర్‌ యాదవ్‌, మామిండ్ల లక్ష్మణ్‌, ఎజాజ్‌, లోలపు శ్రీనివాస్‌, కో–ఆప్షన్‌ సభ్యుడు కుంబాల రవియాదవ్‌, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement