యుద్ధ కళల్లో చిన్నారులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

యుద్ధ కళల్లో చిన్నారులకు శిక్షణ

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి ఆలయం ప్రాంగణంలో చిన్నారులు కరాటేలో శిక్షణ పొందుతున్నారు. మండలంలోని సంగోజీపేట్‌కు చెందిన మాగి నవీన్‌ అనే యువకుడు హైందవ వీరుల యుద్ధ కళల గురుకులం(అకాడమీ ది రైట్‌ వే కరాటే క్యాంపస్‌ ) అనే శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులను బేతాళస్వామి వద్ద ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారులకు కరాటేపై శిక్షణ ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement