ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

ఇద్దరికి తీవ్రగాయాలు

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జప్తిజాన్కంపల్లి గేట్‌ వద్ద ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మహ్మద్‌నగర్‌కు చెందిన మల్లేశం, మరో మహిళ మండలంలోని జప్తిజాన్కంపల్లిలో జరిగిన వివాహ వేడుకకు హాజరై బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. నర్సాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డి నుంచి జేబీఎస్‌కు వెళ్తుండగా జప్తిజాన్కంపల్లి గేట్‌ వద్ద మల్లేశం నడుపుతున్న బైక్‌ ఢీకొన్నాయి. మల్లేశంతోపాటు బైక్‌పై ఉన్న మరో మహిళకు తీవ్రగాయాలు కాగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement