● ఇద్దరికి తీవ్ర గాయాలు
రామారెడ్డి: మండల కేంద్రంలో పైప్‌లైన్ నిర్మాణం కోసం తీసిన 12 అడుగుల భారీ గుంతలోకి కారు దూసుకెళ్లి నిట్ట నిలువునా ఇరుక్కుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కామారెడ్డి నుంచి రంగంపేట వైపు వస్తున్న కారు శివారులోకి చేరుకోగానే ఒక్కసారిగా రోడ్డు పక్కన పైప్‌లైన్ కోసం తీసిన గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న భార్యాభర్తలు రమేశ్ గౌడ్ వనిత ఇరుక్కుపోగా రంగంపేట గ్రామస్తులు బయటికి తీశారు. తీవ్ర గాయాలైన దంపతులను 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


