మద్యం దుకాణంలో రూ.లక్ష
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్‌లో ఉన్న ఓ లిక్కర్ మార్ట్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిర్వాహకులు గురువారం రాత్రి దుకాణం మూసేసి ఇళ్లకు వెళ్లగా, అర్ధరాత్రి తర్వాత అద్దాలు, కిటికీలు పగులగొట్టి దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు చోరీ చేశారు. కౌంటర్‌లో దాచి ఉంచిన నగదు ఎత్తుకెళ్లినుట్ల సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రూ.లక్ష చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. పట్ణణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసిన ఇంట్లో..
దోమకొండ: దోమకొండ గ్రామానికి చెందిన సామల నరేశ్ ఇంటికి తాళం వేసి కామారెడ్డిలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వృత్తి రీత్యా నరేశ్ రెండు నెలలుగా కామారెడ్డిలో ఉంటున్నారు. శుక్రవారం పని నిమిత్తం దోమకొండకు రాగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని రూ. 7,000 అపహరణకు గురైనట్లు బాధితుడు పేర్కొన్నారు.
ఎల్లారెడ్డిలో చోరీకి విఫలయత్నం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో జ్యువెల్లరి దుకాణంలో దొంగలు చోరీకి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. పట్టణంలోని అవుసుల మాణిక్యం జ్యువెల్లరి దుకాణానికి సంబంధించిన మూడు తాళాలను దుండగులు గురువారం అర్ధరాత్రి పగులగొట్టారు. నాలుగో తాళం పగలగొట్టే సమయంలో జనం అలికిడికి దొంగలు పరారై ఉంటారని బాధితుడు మాణిక్యం తెలిపారు. తలుపులు తెరవకపోవడంతో ఎలాంటి చోరీ జరగలేదని పేర్కొన్నారు.
సుభాష్‌నగర్ అపార్ట్‌మెంట్‌లో..
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని సుభాష్‌నగర్ అపార్ట్‌మెంట్‌లో చోరీ జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు.రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ వేణుగోపాలరావు సుభా
ష్‌నగర్‌లోని అక్షయ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. ఆయన ఊరికి వెళ్లగా గురువారం రాత్రి దొంగలు చొరబడి కిలో వెండి ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు చేతివాటం ప్రదర్శించారు.
కామారెడ్డి, దోమకొండ, నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.


