సామూహిక కుంకుమార్చనలు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి కోడూరు హన్‌మాన్ ఆలయ ప్రాణప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు చేశారు. కుంకుమార్చనల అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నప్రసాదం అందజేశారు.
ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన
బీబీపేట: మల్కాపూర్‌లో రెండు రోజులుగా జరుగుతున్న ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయం ముందు దాత మాసానిపల్లి పెరమాండ్లు అందించన ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించారు. ఉదయం నుంచి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ప్రాణ ప్రతిష్ట జరిపించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు.
బోనమెత్తిన గంగపుత్రులు
నిజాంసాగర్ (జుక్కల్): శివసత్తుల పూనకాలు..... డప్పు సప్పులతో గంగమ్మ తల్లికి గంగపుత్రులు ఘనంగా బోనాలు సమర్పించారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలను గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. బోనాలతో ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు.
పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట గ్రామశివారులోని పెద్దమ్మతల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శుక్ర, శనిరాల్లో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆదివారం గ్రామదేవతలకు బోనాలు, సోమవారం పెద్దమ్మతల్లికి బోనాలను సమర్పించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు.


