క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

భర్తను చంపిన భార్య

హత్యకు సహకరించిన కొడుకు

నందిపేట్‌(ఆర్మూర్‌): కట్టుకున్న భర్తను కొడుకు సహాయంతో హత్య చేసిన ఘటన నందిపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జానారెడ్డి, నందిపేట ఎస్సై శ్యామ్‌రాజ్‌ శుక్రవారం తెలిపారు. నందిపేట మండలం మాయాపూర్‌ గ్రామానికి చెందిన పుంటికూర ముత్యం(44) ఈ నెల 6న మృతి చెందాడు. మద్యం మత్తులో మంచంపై నుంచి కిందపడి చనిపోయాడని మృతుడి భార్య లలిత చెప్పడంతో కుటుంబసభ్యులకు అనుమానం కలిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తామే హత్య చేసినట్లు ఒప్పకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోపాటు ముత్యంకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఇంట్లో తరుచూ గొడవలు జగుతుండేవని మృతుడి భార్య లలిత తెలిపింది. ఎంత చెప్పినా అతనిలో మార్పు రాకపోవడంతో ఈ నెల 5న రాత్రి మద్యం తాగి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముత్యం మెడకు చీర అంచుతో బిగించగా కొడుకు కాళ్లు కదలకుండా పట్టుకొని సహకరించాడని, దీంతో తన భర్త మృతి చెందాడని పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది. శుక్రవారం నిందితులు లలిత, ఆమె కుమారుడిని కోర్టులో హాజరుపరచినట్లు సీఐ జానారెడ్డి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement