దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

May 8 2026 12:31 PM | Updated on May 8 2026 12:31 PM

నిజామాబాద్‌ రూరల్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ప్రతిభచాటిన, సేవలందించిన వారిని సత్కరించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ‘ఆల్‌ దిబెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ’ అధ్యక్షుడు ఈఎస్‌ఎస్‌ నారాయణ మాస్టారు ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయిత లు, సంగీత, నృత్య, కళాకారుల, ఉపాధ్యాయు ల, విద్యావంతులు, వైద్యుల, సమాజ సేవకులు తదితర రంగాల్లోని ప్రతిభావంతులు ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్స్‌ జిరాక్స్‌ కాపీలతో ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9652347207 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

నియామకపత్రాల అందజేత

నిజామాబాద్‌ రూరల్‌: రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్‌గా బాడ్సి శేఖర్‌గౌడ్‌, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్‌ సభ్యుడిగా వేణుగోపాల్‌ యాదవ్‌ నియామకపత్రాలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఇద్దరికీ గురువారం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌గౌడ్‌, వేణుగోపాల్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలుపుతూ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement