కామారెడ్డి అర్బన్: కామారెడ్డి–రాజంపేట–గుండారం ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మాణాలు చేసే వారు తప్పనిసరిగా రోడ్డు మధ్య నుంచి 30 ఫీట్ల స్థలం వదిలిపెట్టాలని చిన్నమల్లారెడ్డి గ్రామ సర్పంచ్ బి.లక్ష్మి సూచించారు. గురువారం ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశం నిర్వహించగా ఏఈ, దేవునిపల్లి ఎస్సైలు హాజరయ్యారు. సమావేశంలో ఆర్ అండ్ బీ రోడ్డు నిబంధనలను గ్రామస్తులకు వివరించారు. 500పైగా మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులను సన్మానించారు. సమావేశంలో మాజీ సర్పంచులు ఆనందరావు, రామాగౌడ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
మాచారెడ్డి: మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు శ్రీకాంత్, రాజేశ్వరి, ప్రకాష్, సౌజన్యలు బదిలీపై ఇతర పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం ఎస్సై అనిల్, సిబ్బంది వారిని శాలువా కప్పి సన్మానించారు.


