ప్రారంభమైన కోడూరు హన్‌మాన్
ప్రాణప్రతిష్ఠాపనోత్సవాలు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి దళితవాడ కిష్టమ్మగుడి సమీపంలోని ప్రాచీన కోడూరు హన్‌మాన్ ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో ప్రాణప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదపండితులు గంగవరం నారాయణశర్మ, అంజనేయశర్మల ఆధ్వర్యంలో గురువారం విగ్రహాల జలవాసం, హోమం, అన్నదానం నిర్వహించారు. ఐదురోజులు హోమ కార్యక్రమాలుంటాయని అంజనేయశర్మ పే ర్కొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు నర్సింలు, రమేష్, నరేష్‌రెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా బోనాల ఊరేగింపు
రామారెడ్డి: గంగపుత్రుల కులదైవం గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా గంగపుత్ర మహిళలు గురువారం పోచమ్మలకు బోనాల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. శుక్రవారం గంగమ్మ తల్లి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనతో పాటు అన్నదానం, సాయంత్రం గంగమ్మ తల్లికి బోనాల ఊరేగింపు ఉంటుందని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు నామాల లింబాద్రి తెలిపారు.
యాడారంలో పెద్దమ్మకు బోనాలు..
బీబీపేట: యాడారంలో ముదిరాజ్ సదర్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న వనదుర్గ పెద్దమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున్న బోనాలు ఊరేగించారు. బైండ్లోళ్ల ఆట పాటలతో, డప్పు చప్పుళ్లతో ఘనంగా బోనాలను తీశారు.
మల్కాపూర్‌లో ఆంజనేయ స్వామి
ఉత్సవాలు
బీబీపేట: మల్కాపూర్‌లో ఆంజనేయ స్వామి ఉత్సవాలు రెండు రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ప్రతి వీధి గుండా ఆలయం ముందు ప్రతిష్ఠించే ధ్వజ స్తంభాన్ని డప్పు చప్పుళ్ల మధ్య తీసుకువచ్చారు. ప్రతి ఇంటి నుంచి కలశాలతో మహిళలు ర్యాలీగా ఆలయం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
వైభవంగా అమ్మవారి
ప్రతిష్ఠాపన మహోత్సవం
బాన్సువాడ రూరల్: హన్మాజీపేట్ జీపీ పరధిలోని సంగ్రాం తండాలో నూతనంగా నిర్మించిన మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆలయంలో జంగదాంబ దేవి, శ్రీసంత్ సేవాలాల్, రామ్‌రావ్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన చేపడుతున్నారు. గురువారం వేదపండితులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం పౌరాదేవి పీఠాధిపతి శ్రీ బాబుసింగ్ మహరాజ్, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, ఆల్ ఇండియా బంజారా శక్తీపీఠం పౌరాదేవి జాతీయ ప్రధానకార్యదర్శి బద్యానాయక్‌ల సంయుక్త ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


