నిజామాబాద్ అర్బన్: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్‌లో జాబ్‌మేళా నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జాబ్‌మేళాను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నిజామాబాద్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగాలు సాధించిన యువత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కాగా, జాబ్‌మేళాకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతకు ముందు ఉద్యోగాలకు ఎంపికై న వారికి కలెక్టర్, ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీవైఎస్‌వో పవన్ కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేశ్ కుమార్, ఎన్‌ఐసీ అధికారి మధు, ఈ–డీఎం కార్తిక్, వంశీధర్ రెడ్డి, టాస్క్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
యువతికి జాబ్ ఆఫర్ లెటర్ అందజేస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి
జాబ్‌మేళాను ప్రారంభిస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి,తాహెర్ తదితరులు
అవకాశాన్ని యువత
సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి,
ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు
మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన


