బాన్సువాడ రూరల్: కొత్తాబాదిలో ఉన్న తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కమల్ కిశోర్ తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీతో పాటు కొత్తగా ఏసీఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేయాలని నూ తనంగా ఎన్నికై న లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొళ్ల సాయిరాంయాదవ్‌కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సూచించారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షునిగా సాయిరాంను నియమిస్తూ నియామాక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తనను నియమించినందుకు ఎమ్మెల్యేకు సాయిరాం యాద వ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు.
బాన్సువాడ రూరల్: ఈ నెల 9న సాయంత్రం నుంచి 10న రాత్రి 9 గంటల వరకు పిట్లం మండల కేంద్రంలోని మజీద్–ఏ–వహీద్‌లో నిర్వహించే ఇస్లామిక్ వర్క్‌షాప్‌ను విజయవంతం చేయాలని జామా మజీద్ ఇమామ్ మౌలానా మహమూద్ అలీ, ఆయేషా మస్జీద్ మౌలానా సయ్యద ఈసా తెలిపారు. ఖత్మే నబూవత్ ఆధ్వర్యంలో నిర్వహించే వర్క్‌షాప్‌నకు హైదరాబాద్, నిజామాబాద్ నుంచి ప్రముఖ ఉలేమాలు హాజరై ప్రసంగిస్తారన్నారు. యువకు లు హాజరై వివిధ అంశాలపై అవగాహన పొందాలన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఏవో రాజలింగంతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. విండో డైరెక్టర్లు, మాజీ సర్పంచ్ సంజీవు, రైతులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు.. ఎమ్మెల్సీ ప్రోసర్ కోదండరామ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం కామారెడ్డి రోటరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి కార్యక్రమానికి కోదండరామ్ హాజరుకాగా టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు ఆయనను కలిసి వినతి పత్రం అందజేసి సన్మానించారు. బీసీ సంఘం నాయకులు సాప శివరాములు, నాగరాజు తదితరులున్నారు.


