42 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

42 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

May 8 2026 12:31 PM | Updated on May 8 2026 12:31 PM

42 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత ధాన్యం లారీ బోల్తా అత్తపై కోడళ్ల హత్యాయత్నం

రుద్రూర్‌: మండల కేంద్రంలోని జవహర్‌నగర్‌ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని సి విల్‌ సప్లయ్‌ అధికారులు గురువారం స్వాధీనం చే సుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో అధికారులు శర్ఫుద్దీన్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు.42 క్వింటాళ్ల రేషన్‌బి య్యాన్ని స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేశారు.

లింగంపేట(ఎల్లారెడ్డి):మండలంలోని సజ్జన్‌పల్లి చౌ రస్తా వద్ద గురువారం ధాన్యం బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడినట్లు రైతులు తెలిపారు. శెట్పల్లిసంగారెడ్డి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధా న్యం బస్తాలు లోడ్‌ చేసుకొని కామారెడ్డికి వెళ్తుండగా మార్గమధ్యంలో సజ్జన్‌పల్లి చౌరస్తా వద్ద లారీ బో ల్తాపడింది. ఘటనలో డ్రైవర్‌తోపాటు ఎవరికి గా యాలు కాలేదని తెలిపారు. ధాన్యం బస్తాలను మ రో లారీలో లోడ్‌ చేసి పంపినట్లు రైతులు తెలిపారు.

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

దోమకొండ: ఆస్తి వివాదాల నేపథ్యంలో అత్తను ఇద్దరు కోడళ్లు హత్య చేసేందుకు యత్నించిన ఘటన దోమకొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కట్ట లక్ష్మిపై ఆమె కోడళ్లు కట్ట లహరిక, కట్ట పవిత్ర బుధవారం రాత్రి దాడి చేశారు. చీర పల్లుతో మెడబిగించి హత్యకు యత్నించగా, లక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. బాధితురాలు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement