స్వీయ గణనపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణనపై అవగాహన

May 8 2026 12:31 PM | Updated on May 8 2026 12:31 PM

గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిదిలోని పిష్కిల్‌ గుట్ట గ్రామ పంచాయితీని గురువారం సందర్శించి తండావాసులకు స్వీయ గణనపై అవగాహన కల్పించినట్లు తహసీల్దార్‌ రేణుక చౌహాన్‌, ఎంపీడీవో రాజేశ్వర్‌ తెలిపారు. అవగాహన కల్పించిన అనంతరం తండాలో వందశాతం స్వీయ గణన నమోదు చేసినట్లు తెలిపారు. సర్పంచ్‌ రేణాబాయి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

స్వీయ గణన చేసుకున్న ప్రజాప్రతినిధులు

ఎల్లారెడ్డిరూరల్‌/కామారెడ్డిటౌన్‌: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపడుతున్న జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా కామారెడ్డి 46, 47 వార్డుల కౌన్సిలర్‌ దంపతులు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణలు, ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ పద్మ శ్రీకాంత్‌లు గురువారం స్వీయ గణన పూర్తి చేసుకున్నారు. ప్రతి ఒక్కరు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసుకోవాలని వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement