18న ఫ్లడ్‌ మాక్‌ ఎక్సర్‌సైజ్‌ | - | Sakshi
Sakshi News home page

18న ఫ్లడ్‌ మాక్‌ ఎక్సర్‌సైజ్‌

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

పాల్గొననున్న అత్యవసర సేవల విభాగాలు

ప్రజలు ఆందోళన చెందొద్దు

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి క్రైం: వర్షాకాల సన్నద్ధతలో భాగంగా జిల్లా కేంద్రంలో ఈనెల 18వ తేదీన జిల్లా స్థాయి ఫ్లడ్‌ మాక్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. వరదలు, విపత్తుల నిర్వహణ చర్యలపై అగ్నిమాపక శాఖ డీజీ విక్రయ్‌సింగ్‌ మాన్‌ గురువారం జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి సమన్వయ స మావేశాన్ని వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించి ప లు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏ ర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ సంగ్వాన్‌ మాట్లా డుతూ.. 18న నిర్వహించే ఫ్లడ్‌ మాక్‌ ఎక్సర్‌సైజ్‌లో రె వెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పంచా యతీరాజ్‌, ఇరిగేషన్‌, మున్సిపల్‌, విద్యుత్‌, గ్రామీణ నీటి సరఫరాశాఖలతోపాటు ఇతర అత్యవసర సేవల విభాగాలు పాల్గొంటాయని తెలిపారు. మాక్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా శాఖల మధ్య సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానాలు, సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు ప్రక్రియ, రక్షణ చర్యలు, సహాయక కార్యక్రమాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, వరదల సమయంలో చేపట్టాల్సిన అన్ని రకాల సన్నద్ధతను పరీక్షించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. ఇది కేవలం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే సన్నద్ధత కార్యక్రమం మాత్రమేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేయాలి..

కామారెడ్డి క్రైం: జనాభా గణన–2027 లో భాగంగా అన్ని కార్యకలాపాల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. గృహగణన కార్యకలాపాలపై గురు వారం సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ భారతి హోలీకేరి వర్చువల్‌గా గురువారం సాయంత్రం సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. గృహ జాబితా రూపకల్పన కార్యకలాపాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ.. జనాభా గణన–2027 కార్యక్రమాన్ని నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరణను ఖచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా అన్ని మండలాల్లో ప్రజలకు జనగణన కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్‌ విక్టర్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement