‘నిధులు మంజూరు చేయండి’ | - | Sakshi
Sakshi News home page

‘నిధులు మంజూరు చేయండి’

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

‘నిధులు మంజూరు చేయండి’ కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్‌వో పశు సంరక్షణ పోస్టర్ల ఆవిష్కరణ

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గత వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు, ధ్వంసమైన హై లెవల్‌ వంతెల మరమ్మతుల కోసం అవసరమైన నిధు లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కను కోరారు. నియోజవకర్గంలోని పలుగ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతులకు రూ.19.60 కోట్ల నిధులు అవసరమవుతాయని వివరిస్తూ మంత్రికి గురువారం వినతిపత్రం అందజేశారు. అలాగే లింగంపల్లిఖుర్దు, అడ్విలింగాల, కన్నాపూర్‌, గిద్ద హైలెవల్‌ బ్రిడ్జిలకు మరమ్మతులు చేపట్టాలని, గాంధారి, రామారెడ్డి, లింగంపేట, రాజంపేట, తాడ్వాయి మండలాల్లోని పలుగ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. నియోజకవర్గంలోని గ్రామీణప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కామారెడ్డి క్రైం: అటవీశాఖ జిల్లా అధికారి (డీఎఫ్‌ఓ)గా గురువారం బాధ్యతలు చేపట్టిన నీరజ్‌ కుమార్‌ టిబ్రీవల్‌ కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది వరకు డీఎఫ్‌వోగా పనిచేసిన నిఖిత బదిలీపై వెళ్లగా, ఆసిఫాబాద్‌ నుంచి నీరజ్‌కుమార్‌ బదిలీపై జిల్లాకు వచ్చారు. కలెక్టర్‌ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలసి అనంతరం జిల్లాలో అటవీ సంరక్షణ, వనమహోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

కామారెడ్డి క్రైం: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేసవిలో పశువుల సంరక్షణ, యాజమాన్యంపై అవగాహన కల్పించేందుకు ప్రభు త్వం రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆవిష్కరించారు. వేసవిలో పశువులకు తగిన ఆహారం, తాగునీరు, నీడ, ఆరోగ్య సంరక్షణ చర్యలపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా ఈ నెల 8న జిల్లాలో పశువుల ఆరోగ్య శిబిరాలు, మేలుజాతి పశువుల అభివృద్ధి, కృత్రిమ గర్భాధారణ, పశు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement