కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12వ జిల్లా స్థాయి సబ్‌జూనియర్ అండర్–8, 10, 12, 14 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. దాదాపు 110 మంది క్రీడాకారులు హాజరు కాగా ఉత్తమ ప్రతిభ చూపిన 25 మంది క్రీడాకారులను ఎంపిక చేయడంతోపాటు వారికి బంగారు, వెండి, కాంస్య పతకాలు, ప్రశంసాపత్రాలను అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, కేపీ అనిల్‌కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్ అందజేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 17న హైదరాబాద్ కొల్లూర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్‌లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. అసోసియేషన్ ప్రతినిధులు, పీఈటీలు శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, నరేశ్‌రెడ్డి, రేణుక, శివాగౌడ్, లక్ష్మణ్, ప్రసాద్, మహేశ్, నరేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


