కామారెడ్డి అర్బన్ : బీసీ రిజర్వేషన్లు, నిరుద్యోగ, రైతాంగ, సాగునీరు, కార్మిక సమస్యలపై ప్రజల్లో చైతన్యవంతులను చేయాలని తెలంగాణ జన సమతి పార్టీ (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారం సాయంత్రం కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ రోటరీ ఆడిటోరియంలో జిల్లా నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లోని జలవిహార్‌లో నిర్వహించే రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలన్నారు. కామారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి త్వరలోనే పర్యటిస్తానని అన్నారు. సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గాన్ని కోదండరామ్ ప్రకటించారు. టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజ్జన రమేశ్‌ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడిగా కుంబాల లక్ష్మణ్‌యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రజనీకాంత్, ఉపాధ్యక్షులుగా పూల్‌సింగ్, లాల్‌సింగ్, కార్యదర్శులు సంగరాజు, వర్షిత్, సంజీవ్, విజయ్‌కుమార్, మహిళా అధ్యక్షురాలిగా నాగరాణి పేర్లను ప్రకటించారు.


