విద్యుత్‌ సరఫరాలో లోపాలపై ఫిర్యాదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరాలో లోపాలపై ఫిర్యాదు చేయాలి

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

బాన్సువాడ : విద్యుత్‌ సరఫరాల ఎలాంటి లోపాలున్నా వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌–2) చైర్మన్‌ ఎరుకల నారాయణ అన్నారు. బాన్సువాడలోని విద్యుత్‌ శాఖ కార్యాలయం ఆవరణలో గురువారం విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కర వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ వినియోగదారులకు ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఫోరమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. అసరమైతే ఫోరమ్‌ సభ్యులే వినియోగదారుల ఇంటికి వచ్చి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. విద్యుత్‌ కోతలు, లో ఓల్టేజీ, ట్రాన్స్‌ఫార్మర్‌ లోపాలు, మీటర్‌ స్టిక్‌ కావడం వంటి సాంకేతిక సమస్యలను 48 గంటల్లో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫిర్యాదు చేయడానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912, ఫోన్‌ నంబర్‌ 83380–22841ను సంప్రదించాలని అన్నారు. సీజీఆర్‌ఎఫ్‌–2 సభ్యులు రామకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement