కో ఆప్షన్‌ సభ్యులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌ సభ్యులకు సన్మానం

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

కో ఆప్షన్‌ సభ్యులకు సన్మానం

కామారెడ్డి టౌన్‌ : కాంగ్రెస్‌ తరఫున మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికై న సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఘనంగా సన్మానించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యులు గోనె సునీత, అలీ బిన్‌ అబ్దుల్లా, ఆస్మా అదిబా ఖనాంను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. కౌన్సిల్‌ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పట్టణ అభివృద్ధికి కో ఆప్షన్‌ సభ్యులు కృషి చేయాలని సూచించారు. వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement