ఇన్‌చార్జి అడిషనల్‌ కలెక్టర్‌గా ఎన్‌వై గిరి | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి అడిషనల్‌ కలెక్టర్‌గా ఎన్‌వై గిరి

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

ఇన్‌చార్జి అడిషనల్‌ కలెక్టర్‌గా ఎన్‌వై గిరి కోర్టుకు ఎన్నికల సామగ్రి ‘నీటి సమస్యలుంటే ఫిర్యాదు చేయండి’ బొమ్మాబొరుసు ఆడుతున్న 9 మంది అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా కామారెడ్డి ఆర్డీవో ఎన్‌వై గిరి నియమితులయ్యారు. అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన మధుమోహన్‌ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఎన్‌వై గిరి బుధవారం ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కలెక్టర్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని 38 వార్డుతో పాటు 36, 40 వార్డుల బ్యాలెట్‌ బాక్స్‌లు, వోటర్‌ లిస్టులు, వోట్‌ కౌంటర్‌ ఫైల్స్‌ ఇతర సామగ్రిని మున్సిపల్‌ అధికారులు కోర్టుకు చేర్చారు. మున్సిపల్‌ ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ 38వ వార్డులో ఓటమి పాలైన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ఓటర్లు, ఇతర వార్డుల ఓటర్లు 38వ వార్డులో ఓటేయడంతో తాను ఓడిపోవాల్సి వచ్చిందని ఆ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్స్‌లు, వోటర్‌ లిస్టులు, వోట్‌ కౌంటర్‌ ఫైల్స్‌ ఇతర సామగ్రిని కోర్టుకు అందించారు.

కామారెడ్డి టౌన్‌ : వేసవి కాలంలో పట్టణ ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్‌ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోందని మున్సిపల్‌ కమిషనర్‌ పర్వతాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని ఏ వార్డులోనైనా నీటి ఎద్దడి ఏర్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పట్టణంలో నీటి సమస్య ఉన్నట్లయితే కింది అధికారులను సంప్రదించాలని సూచించారు.

మున్సిపల్‌ కమిషనర్‌ : 98499 07825

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌

ఇంజినీర్‌ : 98499 07822

మున్సిపల్‌ అసిస్టెంట్‌

ఇంజినీర్‌ : 95151 84201

కామరెడ్డి క్రైం: రాఘవపూర్‌ శివారులో బొమ్మా బొరుసు నిర్వహిస్తున్న ఓ స్థావరంపై దేవునిపల్లి, సీసీఎస్‌ పోలీసులు బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. బొమ్మాబొరుసు ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ. 73 వేల నగదు, రెండు బైకులు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్‌ తెలిపారు.

నేడు, రేపు దోస్త్‌ ప్రత్యేక

కేటగిరి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

తెయూ(డిచ్‌పల్లి): దోస్త్‌ – యూజీ కోర్సులలో స్పెషల్‌ కేటగిరి కింద అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు పీహెచ్‌సీ/ సీఏపీ ఈ నెల 7న, ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌, ఎక్స్‌ట్రా కరిక్యులమ్‌ యాక్టివిటీస్‌ విద్యార్థులు ఈ నెల 8న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాలని తెయూ అడ్మిషన్స్‌ డైరక్టర్‌ వాసం చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ పరిపాలనా భవనంలోని అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికెషన్‌ వెరిఫికేషన్‌ జరుగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement