ఆయిల్‌పాంతో అధిక ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాంతో అధిక ఆదాయం

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

ఆయిల్‌పాంతో అధిక ఆదాయం

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

తాడ్వాయి: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం ఎండ్రియాల్‌ గ్రామశివారులో రైతు బొక్క హన్మండ్లు సాగు చేస్తున్న ఆయిల్‌పాం తోటను సందర్శించారు. 2022 లో మూడున్నర ఎకరాలలో పంటను సాగు చేస్తున్నానని రైతు తెలిపాడు. అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నానని, ఎకరానికి రూ. 1.20 లక్షల వరకు ఆదాయం వస్తోందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆయిల్‌పాం సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. ఆయిల్‌పాం పంట ధర టన్నుకు రూ. 23 వేలు ఉందని, ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. సబ్సిడీపై వచ్చిన ఆయిల్‌పామ్‌కు సంబంధించిన డ్రిప్‌ పరికరాలను ఏడుగురు రైతులకు అందించారు.

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. లబ్ధిదారు పడమటి కౌసల్య ఇంటిని సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఎవరైనా ప్లాస్టిక్‌ కవర్లను పోగు చేసినట్లయితే కిలోకు టిఫిన్‌ బాక్స్‌ ఇస్తామని గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రకటించింది. దీంతో గ్రామానికి చెందిన ఓ మహిళ రెండు కిలోల ప్లాిస్టిక్‌ కవర్లను తీసుకురావడంతో ఆమెకు కలెక్టర్‌ చేతులమీదుగా రెండు టిఫిన్‌ బాక్సులను అందించారు. అనంతరం కలెక్టర్‌ వాటర్‌ట్యాంక్‌ను పరిశీలించారు. గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింలు, ఉద్యానశాఖ జిల్లా అధికారి జ్యోతి, మండల ప్రత్యేకాధికారి రఘునందన్‌, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శ్వేత, ఎంపీడీవో సవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement