ఉత్సవాలకు ‘కోడూరు’ ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలకు ‘కోడూరు’ ముస్తాబు

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

ఉత్సవాలకు ‘కోడూరు’ ముస్తాబు

నేటినుంచి విగ్రహ

పునఃప్రతిష్ఠాపనోత్సవాలు

కామారెడ్డి టౌన్‌ : కోడూరు హనుమాన్‌ ఆలయం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. గురువారంనుంచి 12వ తేదీ వరకు విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

పూర్వ కాలంలో కామారెడ్డి పట్టణం పేరు ‘కోడూరు’గా ఉండేది. అప్పట్లో ఈ గ్రామం కిష్టమ్మ గుడి ప్రాంతంలో ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇక్కడ పురాతన హనుమాన్‌ ఆలయం ఉంది. ఏటా హనుమాన్‌ జయంతి, శ్రీరామనవమి పండుగల సందర్భంగా పట్టణంలో నిర్వహించే శోభాయాత్రలు ఇక్కడినుంచే ప్రారంభమవుతాయి. వేద పండితులు గంగవరం ఆంజనేయశర్మ సూచనల మేరకు భక్తులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో గురువారం నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement