భిక్కనూరు: ధాన్యం తూకం వేసి వారం రోజులు గడుస్తున్నా రైస్‌మిల్లులకు తరలించేందుకు లారీలు రావడం లేదని రైతు లు ఆరోపించారు. బుధవారం కాచాపూర్ రైతులు కామారెడ్డి –పెద్దమల్లారెడ్డి రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తూకం వేసిన 6 వేల బస్తాల ధాన్యం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలోనే మూలుగుతోందన్నా రు. వెంటనే లారీలను పంపించి ధాన్యం తరలించాలని డి మాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీకాంత్, భిక్కనూరు తహసీల్దార్ సునీత, గ్రామపరిపాలన అధికారి రాజులు వచ్చి రైతులతో మాట్లాడారు. వెంటనే ధాన్యం బస్తాలను తరలింపజేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి నిరసనను విరమించారు.


