● 146 మందికి బదిలీ: ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి టౌన్ : జిల్లాలో 146 మంది పోలీస్ సిబ్బంది బదిలీ అయ్యారని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సివిల్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీ ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. ఎనిమిది మంది ఏఎస్సైలు, 18 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 111 మంది కానిస్టేబుళ్లు, 9 మంది ఎంటీ సెక్షన్ సిబ్బంది బదిలీ అయ్యారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన కానిస్టేబుళ్లు, నాలుగేళ్లు పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడేళ్ల సర్వీస్ ఉన్న ఏఎస్సైలతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి విల్లింగ్ స్టేషన్ల ఆధారంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


