ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

ముగిసిన శ్రీ కృష్ణ ఆలయ వార్షికోత్సవాలు

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌ నగర్‌ మండలం తుంకిపల్లిలో రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి బోనాల ఊరేగింపు నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు జరిపారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయం వరకు మహిళలు, యువకులు ర్యాలీగా తరలి వెళ్లారు. సర్పంచ్‌ కుమ్మరి రాములు, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, గౌడ సంఘం నాయకులు ఉన్నారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): తుక్కోజీవాడిలో శ్రీ కృష్ణ మందిరం వార్షికోత్సవాలు బుధవారం ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన, అన్నపూర్ణ కల్యాణోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. సర్పంచ్‌ సంగారావు, ఆలయ కమిటీ ప్రతినిధులు రమేశ్‌ రావు, నవీన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement