తెయూతో స్కిల్‌ డిజైన్‌ టెక్నాలజీస్‌ ఎంవోయూ | - | Sakshi
Sakshi News home page

తెయూతో స్కిల్‌ డిజైన్‌ టెక్నాలజీస్‌ ఎంవోయూ

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

తెయూ(డిచ్‌పల్లి): స్కిల్‌ డిజైన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హైదరాబాద్‌) సంస్ధ, తెలంగాణ యూ నివర్సిటీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నది. ఈ మేరకు బుధవారం వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ టి యాదగిరిరావు సమక్షంలో స్కిల్‌ డిజైన్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ముప్పల్ల, వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం యాదగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ సంస్థ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఇంటర్న్‌షిప్‌, మూక్స్‌లలో ఆసక్తికర విద్యార్థులకు శిక్షణ ఇస్తుందని రిజిస్ట్రార్‌ తెలిపారు. తమ కార్యకలాపాలు యూనివర్సిటీ విద్యార్థులతోపాటు అనుబంధ కళాశాలల విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటాయని సంస్థ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ముప్పల్ల తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement