రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణఖేడ్‌లో హైదరాబాద్ – నాందేడ్ – అకోలా నేషనల్ హైవే 161పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. జుక్కల్‌కు చెందిన పొడిచెర నిఖిల్ (23) బైక్‌పై సంగారెడ్డి నుంచి స్వస్థలానికి వెళ్తుండగా.. నిజాంపేట్ సమీపంలో వంతెన సైడ్‌వాల్ బైక్ ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నిఖిల్‌ను ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి హన్మంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


