కామారెడ్డి అర్బన్: చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటే ఆ రోజులు ఎంత బాగుండేది అనిపిస్తుంది. నేను అమ్మమ్మ ఊరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లింగన్నపేటలో చదువుకున్నా. వేసవి సెలవుల్లో దోస్తులతో కలిసి ప్రతిరోజూ లింగన్నపేట పెద్ద చెరువులో సాన్నాలు చేసేవారం. అలాగే దొరవారి కోనేరులో పై నుంచి దూకి ఈత కొట్టేవారం. ఆకలైతే దగ్గర చెట్ల నుంచి తెంపుకుని మామిడి పండ్లు, జామ పండ్లు తినేవారం. అలాగే దగ్గరిలోని కొత్తపల్లికి వెళ్లేవారం. లింగన్నపేటలో తాళ్లతో కట్టి ఉండే రథాన్ని లాగేవారం. ఎంతో అల్లరిగా సంతోషంగా చిన్నతనం గడిచింది. అలాంటి రోజులు ఈరోజు పిల్లలకు లేవు అనిపిస్తుంది. – యెల్లంకి సుదర్శన్, వ్యాపారి, కామారెడ్డి


