భిక్కనూరు: నా చిన్నతనంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడ పుంజీతం ఆట(పులి మేక) ప్రతిరోజు ఆడేవాడిని. అలాగే క్యారంబోర్డు, అష్టాచెమ్మా ఆడేవాడిని. ఎండ తగ్గాక సాయంత్రం పూట పంట చేనుల వద్దకు వెళ్లి మామిడి కాయలు తెంపుకుని అక్కడే తినేవాళ్లం. ఎప్పుడు ఎండా కాలం వస్తుందా అని రోజులు లెక్కించుకునేవాడిని. అలాగే ప్రతిరోజు తాటి ముంజలు మొర్రిపండ్లను కూడా తినేవాళ్లం. అప్పట్లో పది పైసలకు 20 బిస్కట్లు వచ్చేటివి. – తాటిపాముల నాగభూషణంగౌడ్, రిటైర్డ్ ఎంఈవో, భిక్కనూరు


