నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లికలాన్, వెంకంపల్లి గ్రామాల్లో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. లింగంపల్లికలాన్‌లో నాయికోటి రుక్కవ్వ, వెంకంపల్లిలో పోల రమేష్‌కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు వారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకున్నారు. దీంతో బుధవారం నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో ప్రభాకరచారి ఆయా గ్రామాల సర్పంచ్ అనిత, జ్యోతితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహాప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పేదలకు వరం లాంటిది ఇందిరమ్మ ఇళ్లు
బీబీపేట: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు వరం లాంటివని మాందాపూర్ సర్పంచ్ ఆకుల హరీష్ యాదవ్ అన్నారు. బుదవారం గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. నూతన వస్త్రాలను అందజేశారు. కార్యదర్శి గంగుబాయి, వార్డు సభ్యులు సతీష్, కనకయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
దోమకొండలో..
దోమకొండ: మండల కేంద్రంలోని పెద్దిరెడ్డి నాగమణి–భాస్కర్‌రెడ్డిలు బుధవారం గృహప్రవేశం చేశారు. ఈ సందర్బంగా మాజీ జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్ లబ్ధిదారులకు నూతన వస్త్రాలను బహూకరించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశపోయిన శ్రీనివాస్, నేతలు అనంత్‌రెడ్డి, సీతారాం, మధు, సిద్దారెడ్డి, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో సొంతింటి కల నెరవేరుతున్నదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం తిమ్మారెడ్డి, కొక్కొండ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇల్లును ఎంపీడీవో నరేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి బిల్లులు సకాలంలో జమచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యదర్శి శ్రవణ్‌కుమార్ ఉన్నారు.


