● పంటల మార్పిడితో మేలు
● రైతువారోత్సవంలో వ్యవసాయ
సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ రూరల్: ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతులను పాటిస్తూ రైతులు అప్పులేని వ్యవసాయం దిశగా సాగాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం దేశాయిపేట్ సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు వారోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. రైతులు సాగు ఖర్చులు తగ్గించుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ లాభసాటి వ్యవసాయం చేయాలని సూచించారు. పంటమార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుందన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే గంగాధర్, బాన్సువాడ ఏఎంసీ చైర్‌పర్సన్ అంజవ్వ, సొసైటీ చైర్మన్ ఎర్వాల క్రిష్ణారెడ్డి, ఏడీఏ అరుణ, సర్పంచ్‌లు వీరేశం, రమేష్‌నాయక్, మల్లుగొండ, నాయకులు నారాయణరెడ్డి, ఉద్దర రాజ్‌కుమార్, ప్రశాంత్, విజయ్‌గౌడ్, శ్రావణ్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


