న్యూస్‌రీల్
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు..
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026
– 9లో u
విద్యారంగ అభివృద్ధికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా మని ప్రభుత్వాలు గొప్పులు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. కనీస సౌకర్యాలు కరువవడం, సరిపడా టీచర్లు లేకపోవడంతో జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతూనే ఉంది. సౌకర్యాలు మెరుగుపరచకపోతే చాలా పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతంలో 1,257 స్కూళ్లు ఉండేవి. విద్యార్థులు లేకపోవడంతో పలు పాఠశాలలు మూతపడి గతేడాది 1,017 కు తగ్గిపోయాయి. అందులోనూ 52 స్కూళ్లలో జీరో విద్యార్థులున్నట్లుగా గుర్తించారు. దీంతో గత విద్యాసంవత్సరంలో 965 పాఠశాలలే కొనసాగాయి. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, తరగతులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల క్రితం 81,864 మంది విద్యార్థులు ఉంటే గత విద్యాసంవత్సరానికి సంఖ్య 76,082 కి తగ్గిపోయింది. మూడేళ్లలో ఆరువేల మంది విద్యార్థులు తగ్గిపోవడం గమనార్హం.
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, కొన్ని బడులు మూతబడడానికి పలు కారణాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఉచితంగా ఇవ్వడం, మధ్యాహ్న భోజనం సమకూర్చడం వంటి పథకాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుకు ఎందుకు పంపుతున్నారో పాలకులు గుర్తించడం లేదు. కొన్ని బడుల్లోనే సౌకర్యాలు ఉండగా, చాలాచోట్ల సమస్యలున్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, కనీసం తాగునీటి సౌకర్యం లేకపోవడం గమనార్హం. పిల్లలు ఇంటి నుంచే తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు సక్రమంగా రాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. భోజనం లోనూ నాణ్యత ప్రశ్నార్థకంగానే ఉంది. చాలా చోట్ల శిథిలావస్థకు చేరిన గదుల్లో ఎప్పుడు పెచ్చులూడి పడిపోతాయోనన్న భయం మధ్య చదువులు సాగుతున్నాయి. కొన్నిచోట్ల వివిధ పథకాల కింద చేపట్టిన అదనపు గదుల నిర్మాణాలు నిధుల సమస్యతో అర్ధాంతరంగా నిలిచిపోయి చెట్లకింద చదువుకునే దుస్థితి ఉంది. వీటికి తోడు సబ్జెక్టు టీచర్లు లేక చాలాచోట్ల విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమం కూడా మొక్కుబడిగానే సాగుతోంది. సర్కారు బడులకు పిల్లలను రప్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
‘ప్రైవేటు’లో పెరుగుదల..
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా.. ప్రైవే ట్ స్కూళ్లలో మాత్రం ఏటా పె రుగుతోంది. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 184 ఉన్నాయి. మూడేళ్ల క్రితం అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 65,271 మంది విద్యార్థులు ఉండగా.. గతేడాది వీరి సంఖ్య 71,165కు పెరిగింది. అంటే మూడేళ్లలో దాదా పు ఆరువేల మంది విద్యార్థులు పెరిగారు. 965 ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 76,082 మంది విద్యార్థులుండగా.. కేవలం 184 ప్రైవేటు పాఠశాలల్లోనే 71,165 మంది విద్యార్థులు ఉండడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న త విద్యాభ్యాసం చేసిన ఉపాధ్యాయులు దాదా పు ఐదు వేలపైచిలుకు పనిచేస్తున్నారు. ప్రైవే టు బడుల్లో చాలావరకు గ్రాడ్యుయేషన్ చదివి న వారితోనే నెట్టుకొస్తున్నారు. కొద్దిమంది మా త్రమే ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారున్నారు. అయినా ప్రైవేట్ బడులవైపే విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గుచూపుతుండడం ఆలోచించాల్సిన విషయం.
పర్యవేక్షణ కరువు..
స్కూళ్లను పర్యవేక్షించే అధికారులు కరువయ్యా రు. చాలామంది ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నా.. కొందరు మాత్రం సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కూడా కొందరు డుమ్మాలు కొ డుతున్నట్లు తెలుస్తోంది. మండల విద్యాశాఖ అ ధికారులుగా సీనియర్ పీజీ హెచ్‌ఎంలను నియమించారు. వారు తాము పనిచేసే బడిని, మండ ల విద్యాశాఖను చూసుకోవాల్సి ఉంటుంది. జి ల్లా స్థాయిలోనూ అదే పరిస్థితి ఉంది. దీంతో బడుల్లో బోధన ఎలా సాగుతుందన్న దానిపై ఎ వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందడం లేదన్న భావన తల్లిదండ్రుల్లో పెరిగిపోతోంది. దీంతో పిల్లల భవిష్యత్ కోసం చాలామంది తల్లిదండ్రులు అప్పు చేసైనా ప్రైవేట్ బడికి పంపిస్తు న్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి, ప్రైవేటులో పెరుగుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సర్కారు స్కూళ్లలో ఏటేటా
తగ్గుతున్న విద్యార్థులు
ప్రైవేట్ పాఠశాలలకు
పంపిస్తున్న తల్లిదండ్రులు
సౌకర్యాలు మెరుగుపరచాలంటున్న విద్యాభిమానులు


