రైతు వేదికలలో సౌర వెలుగులు! | - | Sakshi
Sakshi News home page

రైతు వేదికలలో సౌర వెలుగులు!

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

ప్రతిపాదనలు పంపించాం

సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు దిశగా సర్కారు చర్యలు

నిర్వహణ భారం తగ్గించేందుకు..

ఎల్లారెడ్డిరూరల్‌ : రైతు వేదికలకు సౌర విద్యుత్‌ అందించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే సోలార్‌ ప్యానళ్లు అమర్చే అవకాశాలున్నాయి. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించేందుకు గత ప్రభుత్వం క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించింది. పంటల సాగుకు ప్రణాళికలను సిద్ధం చేయడం, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు రైతులందరు ఒకచోట సమావేశమయ్యేందుకు వీటిని నిర్మించారు. జిల్లాలో 104 రైతు వేదికలు ఉన్నాయి. వీటిలో రైతులతో నేరుగా మాట్లాడేందుకుగాను వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం గలవి 72 ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో ప్రతి మంగళవారం పంటల సాగుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణకు ప్రత్యేక నిధులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. విద్యుత్‌ బిల్లులతో పాటు వర్కర్ల వేతనాలు కూడా భారంగా మారింది.

సౌర పలకల ఏర్పాటుతో..

రైతు వేదికలలో సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అన్ని వేదికలలో ఒకేసారి కాకుండా దశలవారీగా సౌర వి ద్యుత్‌ అందించే అవకాశాలున్నాయి. విద్యుత్‌ బిల్లు ల భారం తగ్గించేందుకు వీటిని బిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

జిల్లాలోని 104 రైతు వేదికలలో సోలార్‌ ప్యాన ల్స్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ప్ర తిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి ని ధులు మంజూరు కాగానే రైతు వేదికలలో ఏ ర్పాటు చేస్తాం. – మోహన్‌రెడ్డి,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement