స్వీయ గణనలో ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణనలో ఆదర్శం

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

సోమ్లానాయక్‌ తండాలో

వంద శాతం పూర్తి

రాష్ట్రంలో రెండో గ్రామంగా గుర్తింపు

బాన్సువాడ రూరల్‌: బాన్సువాడ మండలంలోని సోమ్లానాయక్‌ తండా గ్రామం స్వీయ గణన (సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌)లో ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ వంద శాతం సీయ గణనలో పాల్గొన్నారు. ఇలా రాష్ట్రంలో వందశాతం పూర్తిచేసిన రెండో గ్రామంగా సోమ్లానాయక్‌ తండా రికార్డు సృష్టించింది. ఈ తండా జిల్లాలో తొలిగ్రామంగా గుర్తింపు పొందింది.

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశం మేరకు మండల స్థాయి అధికారులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్రామంలో వి స్తృతంగా అవగాహన కల్పించారు. ఇంటింటికి వె ళ్లి స్వీయ గణన ప్రాముఖ్యతను వివరించి, ఆన్‌లై న్‌లో వివరాలు నమోదు చేసుకునేలా చూశారు. సర్పంచ్‌ మీరిబాయి చందర్‌, పాలకవర్గ సభ్యు లు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రతి కు టుంబం స్వీయ గణన పూర్తిచేసేలా ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు, వలంటీర్లు ప్రజలకు స హాయం చేయడంతో నమోదు ప్రక్రియను సులభతరమైంది. మంగళవారం నాటికి గ్రామంలోని అన్ని కుటుంబాలు స్వీయ గణన పూర్తిచేయడంతో లక్ష్యం నెరవేరింది. నిరక్షరాస్యులు, వృద్ధులు, డిజిటల్‌ పరిజ్ఞానం లేనివారికి ప్రత్యేకంగా సహ కారం అందించిన వారిని తహసీల్దార్‌ నరేందర్‌ గౌడ్‌ అభినందించారు. ఇతర గ్రామాలు సోమ్లా నాయక్‌ తండాను ఆదర్శంగా తీసుకుని స్వీయగణనను వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మీరిబాయి చందర్‌, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, జీపీవో విఠల్‌, ఉపాధ్యాయులు కుషాల్‌, మంద ప్రవీణ్‌, వసంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement