ఇన్‌చార్జి అడిషనల్‌ కలెక్టర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి అడిషనల్‌ కలెక్టర్‌ బదిలీ

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

ఇన్‌చార్జి అడిషనల్‌ కలెక్టర్‌ బదిలీ

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), డీఆర్‌వో సీహెచ్‌ మధుమోహన్‌ బదిలీ అయ్యారు. గతేడాది అక్టోబర్‌లో కామారెడ్డి డీఆర్‌వోగా వచ్చిన ఆయనకు నెలరోజులకే అదన పు కలెక్టర్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ యన నేతృత్వంలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. అధికారులు, ఉద్యోగులను కలుపుకుపోయే అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఆయనను గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరికీ పోస్టింగ్‌ ఇవ్వలేదు.

కీలక పోస్టుల్లో ఇన్‌చార్జీలే..

మధుమోహన్‌ బదిలీతో జిల్లాలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), జిల్లా రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే పలు శాఖలకు జిల్లా అధికారులుగా ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. డీఎంహెచ్‌వో, డీఈవో, జిల్లా ఎకై ్సజ్‌ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, జిల్లా యువజన సంక్షేమ అధికారి తదితర పోస్టుల్లో ఇన్‌చార్జీ అధికారులే ఉన్నారు. కలెక్టరేట్‌లో కీలకమైన సూపరింటెండెంట్‌ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు సూపరిండెంట్‌లు హజ్‌ యాత్రకు వెళ్లగా మరో ఇద్దరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు సూపరింటెండెంట్‌లే పనిచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement