జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి

మద్నూర్‌ : మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం లేకపోవడంతో పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఇబ్బందిపడుతున్నామని రైతులు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలో 1,325 ఎకరాల్లో జొన్న పంట సాగయ్యిందన్నారు. 2,650 టన్నుల వరకు పంట దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. డోంగ్లీలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్‌ గోండ, రఘు గోండ, రవి పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement