మద్నూర్: మద్నూర్ కొనుగోలు కేంద్రంలో శనగ పంట విక్రయించి నలభై రోజులు కావస్తున్నా ఇప్పటికీ డబ్బులు రాలేదని రైతులు పేర్కొన్నారు. డబ్బులు ఇప్పించాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ ముజీబ్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శనగ పంట విక్రయించి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. డబ్బులు ఇప్పించాలని ఇంతకు ముందు కూడా వినతి పత్రం అందించామని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. త్వరగా డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైతులు నరేశ్, సంతోష్, గంగారాం, నాగేశ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


