లింగంపేట: మండలకేంద్రం నుంచి శెట్పల్లి, అయ్యపల్లి, పర్మళ్ల, జల్దిపల్లి, ఎక్కపల్లి, బొల్లారం మీదుగా ఎ ల్లారెడ్డికి ఇరవై ఏళ్ల తర్వాత బస్సు సర్వీస్ పునఃప్రారంభమైంది. ఆయా గ్రామాల సర్పంచ్‌లు సోమవారం లింగంపేట బస్టాండ్‌లో బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి – ఎల్లారెడ్డి రూట్‌లో నడిచే ఈ బస్సు లింగంపేట, శెట్పల్లి, అయ్యపల్లి, పర్మళ్ల, జల్దిపల్లి, ఎక్కపల్లి, బొల్లారం మీదుగా సాగుతుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాలకు బస్సు నడపడానికి కృషి చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సకృనాయక్, అట్టెం శ్రీనివాస్, గోనె లింగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


